ఈ ఆలయం లో ప్రధాన దేవత శ్రీ శ్రీ శ్రీ సిరి తల్లి అమ్మవారు. ఇది సుమారు 300-400 సంవత్స రాల నాటి పురాతన కొయ్య (చెక్క ) విగ్రహ ఆలయం, మరియు దేవత గ్రామ సంచారిణి. ఎం దుకంటే ఆమె నెల రోజులు గొల్లప్రోలు గ్రామం లోని సంచరించి ప్రతి ఇంటికి వెళ్లి భక్తులందరి కోరికలను నెరవేరుస్తుంది. సిరిమను జాతర ప్రతి సంవత్సరం మే నెలాఖరు లేదా జూన్ లో (వైశాఖ మాసం) మూడు రోజులు జాతర నిర్వహించబడుతుంది. చుట్టు పక్కల ఉన్న అన్ని పట్టణాలు మరియు గ్రామాల నుండి దాదాపు 20,000-30,000 మంది భక్తులు జాతర కార్యక్రమం లో పాల్గొంటారు.
శ్రీ శ్రీ శ్రీ సిరి తల్లి అమ్మ వారు ఆలయం తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మునిసిపాలిటీలో ఉంది మరియు గ్రామ దేవత విగ్రహం 17-18 శతాబ్దం లో నిర్మించబడిందని వంశపారం పర్యంగా పూర్వి కులు అనిసెట్టి, చక్కల కుటుంబీకులు ఈ జాతర కార్యక్రమాన్ని అనాదిగా కొనసాగిస్తున్నా రు. ఈ అమ్మవారు ను చుట్టు పక్కల గ్రామాల భక్తులందరు తమ ఇంటి ఆడపడుచుగా పసుపు కుం కుమలతో పూజించి అమ్మవారి దివ్య అశీసులు పొందుతారు.
గొల్లప్రోలు మరియు చుట్టుపక్కల గ్రామాలలో ఇది ప్రసిద్ధ పండుగ మరియు ప్రధాన దేవత తన భక్తులకు గొప్ప ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది.